మోటు ప్రాంతంలో పులి సంచారం | - | Sakshi
Sakshi News home page

మోటు ప్రాంతంలో పులి సంచారం

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

మల్కన్‌గిరి : ఆంధ్ర ప్రదేశ్‌లోని పాపికొండలు ప్రాంతం నుంచి వచ్చిన రేడియో కాలర్‌ అమర్చిన ఓ పులి, ఆదివారం సాయంత్రం మల్కన్‌గిరి జిల్లా మోటు అటవీ రేంజ్‌ ప్రాంతంలో సంచరించిందని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం గ్రామస్తుల భద్రతతో పాటు వన్యప్రాణుల రక్షణ కోసం అటవీశాఖ అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు మల్కన్‌గిరి డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సాయికిరణ్‌ తెలిపారు. సోమవారం సమీప గ్రామాల్లో మైక్‌ల ద్వారా ప్రకటనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామస్తులు జాగ్రతగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని ముఖ్యంగా ఆవులను మేత కోసం అడవికి తీసుకెళ్లకూడదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement