మల్కన్‌గిరి : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మురాసు తుఫాన్ నేపథ్యంలో మల్కన్‌గిరిలో ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం అత్యవసర చర్యలు ముమ్మరం చేసింది. కలెక్టర్ ప్రధమేశ్ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో జీరో క్యాజువాలిటీ లక్ష్యంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని చిత్రకొండ, బయపోడ, బలిమెల, బోండాఘాటీలపై నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. గర్భిణులు, దివ్యాంగులు, చిన్నారులు, వృద్ధులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పాఠశాలలకు 2 నుంచి 4 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.


