కొరాపుట్: కొలాబ్ రిజర్వాయర్‌లో అరుదైన విదేశీ ఫ్లెమింగో పక్షి చిక్కుకుంది. సోమవారం ఉదయం కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి తారాగుడ సమీపంలో కొలాబ్ రిజర్వాయర్‌లో ఒక గిరిజన బాలుడు పడవలో తిరుగుతున్నాడు. రిజర్వాయర్‌లో ఒక అరుదైన పెద్ద పక్షిని చూసి భయపడి వెనక్కి వెళ్లాడు. అనంతరం తన మిత్రులను తీసుకొని వచ్చి ఆ పక్షిని పడవలో ఒడ్డుకు చేర్చాడు. అది లేవలేని పరిస్థితి గమనించి గిరిజనులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని పక్షిని స్వాదీనం చేసుకున్నారు. పక్షి ఎత్తు 4 అడుగులు ఉంది. వారు వెంటనే పశు వైద్య సిబ్బందిని రప్పించి చికిత్స అందజేశారు. తమ సంరక్షణ కేంద్రానికి తరలించారు. పక్షి కోలుకున్న తర్వాత ఉన్నతాధికారుల సూచనతో పక్షి పై నిర్ణయం చేస్తామని ప్రకటించారు.


