వంశధారలో వృద్ధురాలి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

వంశధారలో వృద్ధురాలి గల్లంతు

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల వంశధార నదిలో వృద్ధురాలు గల్లంతైంది. కొత్తలుగుడ గ్రామానికి చెందిన బి.పగడాలు అనే వృద్ధురాలు సోమవారం ఉదయం సమీపంలో గల వంశధార నదికి స్నానాని వెళ్లింది. నది ప్రవాహానికి కొట్టుకుపోయింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని వెతికారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ సాయంత్రం వరకు లభిచంలేదు. ప్రతీరోజు ఆమె నదిలో స్నానం చేసి ఇంటికి వస్తుంటారని కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన గుణుపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement