రాయగడ: స్ధానిక డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 52 వినతులను అధికారులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రాజ్‌ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ మృణాళిని రాథోడ్, అటవీశాఖ అధికారి అన్నా సాహెబ్ అహలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ విశ్వంబర్ కుమార్ బెహర, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి పాల్గొన్నారు. స్వీకరించిన 52 వినతుల్లో 39 వ్యక్తిగతమైనవిగా, 12 సామూహిక గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. వీటిలో రెండింటిని అక్కడకక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ కులకర్ణి ఆదేశించారు. కాగా రెడ్‌క్రాస్ నుంచి ఒకరికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.


