చోరీ నిందితులకు జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

చోరీ నిందితులకు జైలుశిక్ష

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

హిరమండలం: ఆలయంలో చోరీ ఘటనకు సంబంధించి నిందితులిద్దరికీ జైలుశిక్షతో పాటు రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కొత్తూరు కోర్టు తీర్పునిచ్చినట్లు హిరమండలం ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. దుర్బలాపురం గ్రామంలోని బాల త్రిపురసుందరి ఆలయంలో 2024 సెప్టెంబర్‌ 2న చోరీ జరిగింది. ఆగంతుకులు తొమ్మిది రాగి విగ్రహాలను ఎత్తుకొని వెళ్లిపోయారు. అప్పటి ఎస్‌ఐ యాసిన్‌ కేసు నమోదు చేశారు. ఘటనకు పాల్పడిన కూర్మాన శ్రీనివాసరావు, సవర సూర్యంలను అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెల్లడించింది. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలుశిక్ష విధించినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు వెల్లడించారు.

వలస మత్స్యకారుడు మృతి

రణస్థలం: కర్ణాటకలోని మంగళూరు సముద్ర తీరంలో బోటుపై వేటకు వెళ్లిన రణస్థలం మండలం జీరుపాలెం గ్రామానికి చెందిన సూరాడ రామస్వామి (32) ప్రమాదవశాత్తు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో తోటి మత్స్యకారులు రక్షించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామస్వామి మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement