రైలు మార్గానికి 26.66 ఎకరాల అప్పగింత | - | Sakshi
Sakshi News home page

రైలు మార్గానికి 26.66 ఎకరాల అప్పగింత

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

రైలు మార్గానికి 26.66 ఎకరాల అప్పగింత

జయపురం: జయపురం–నవరంగపూర్‌ రైలు మా ర్గం కోసం జయపురం తహసీల్దార్‌ తన పరిధిలో గల అంబాగుడ గ్రామంలో 26.66 ఎకరాలను సోమవారం రైల్వే అధికారులకు అప్పగించారు. జయపురం తహసీల్దార్‌ సవ్యసాచి జెనా రైల్వే అధికారులతోపాటు రైల్వే మార్గం కోసం సేకరించిన భూముల్లో తిరిగి చూపించారు. రైల్వే అధికారులకు ఆ భూమికి సంబంధించిన అవసరమైన రికార్డుల ను అందజేశారు. జయపురం–నవరంగపూర్‌ రైలు మార్గ కోసం జయపురం తహసీల్దార్‌ నుంచి రైల్వే ప్రాజెక్టుకు 8 గ్రామాలు కేటాయించనున్నారు. అందులో భాగంగా గతంలో 5 గ్రామాల్లోని భూములు రైల్వే ప్రాజెక్టుకు అందజేశారు. మిగతా రెండు గ్రా మాల్లో భూసేకరణ అతి త్వరలో పూర్తిచేయటం జరుగుతుందని తహసీల్దార్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైల్వే అధికారు లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement