పర్లాకిమిడి: ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని రాష్ట్ర రాజధానిలో ఆందోళనలు చేస్తున్నారని, కానీ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో అన్ని అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి దగ్గుబాటు పురందేశ్వరి అన్నారు. ఉదయం రాయగడ జిల్లా నుంచి వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరీ స్థానిక సర్క్యూట్ హౌస్‌లో పార్టీ కోర్ కమిటీలో పాల్గొన్నారు. స్థానిక విశ్వనాథ కల్యాణ మండపంలో సోమవారం మేధావుల సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇటీవల అర్న బ్ తీవ్ర తుఫాన్‌కు చనిపోయిన వారి ఆత్మశాంతికి బీజేపీ శ్రేణులు అయిదు నిమిషాలు సంతాపం వహించారు. అనంతరం ఆమె పార్టీ నాయకులు, మేధావులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ వరు సగా ఓటమి చవిచూస్తుండటంతో సర్ ప్రక్రియలో 13 కోట్ల ఓట్లు తీసివేశారనడం సబబు కాదని పురందేశ్వరీ అన్నారు. సర్ ప్రక్రియ అన్నది ఓటరు జాబితాను శుద్ధి చేయడం అన్నారు.


