జయపురం: కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ జయపురం వారు అవినీతి నిరోధక సచేతన ర్యాలీని సోమవారం నిర్వహించారు. స్థానిక రాజుగారి కోట జంక్షన్ వద్ద ర్యాలీ ప్రారంభమై పట్టణ ప్రధాన మా ర్గం సర్ధార్ వల్లభాయి మార్గం మీదుగా 26వ జాతీ య రహదారిలో గల విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ విభాగ ఎస్పీ అనంత ప్రసాద్ మల్లిక్, డీఎస్పీ అభయ ప్రధాన్, విజిలెన్స్ కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది డి.శశిదర పట్నాయక్ హాజరయ్యారు. ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. విజిలెన్స్ ఎస్పీ అనంతప్రసాద్ మల్లి క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండి, రాష్ట్ర ప్రగతికి దోహదపడాలన్నా రు. అవినీతిని అరికట్టేందుకు తమ విభాగం పని చేస్తుందని, ఎవరు లంచం అడిగినా వెంటనే విజిలె న్స్ విభాగం దృష్టికి తీసుకురావాలన్నారు. దుర్నీతి నిర్మూలన జరిగిన నాడే మన దేశం, సమాజం ప్రగతి సాధిస్తాయన్నారు.


