జయపురం: జయపురం మార్నింగ్ క్లబ్ వారు సోమ వారం జయపురం ఫుట్‌బాల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ ఫెస్టివల్‌లో కులపతి ప్రొఫెసర్ డాక్టర్ హృశికేష్ శనాపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటలు శారీరిక, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రిజిస్టర్ విద్యార్థి యూనియన్ అధ్యక్షులు జ్యోతి రంజన్ పాణిగ్రహి, క్రీడా విభాగ అధికారి కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, క్రీడా విభాగ సలహాదారు అశుతోష్ మహంతి, విద్యార్థి యూనియన్ మాజీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సచిన్‌కుమార్ సాహు తదితరు లు అతిథులుగా హాజరయ్యారు. కొట్‌పాడ్ సమితి గిర్ల ఫుట్‌బాల్ క్లబ్, జయపురం సమితి మొకాపుట్ ఫుట్‌బాల్ క్లబ్‌లు తలపడ్డాయి. ఉభయ టీమ్‌లు ప్రతిభావంతంగా ఆడటం వలన మ్యాచ్ టై అయింది. ఉభయ టీమ్‌ల మధ్య పెనాల్టీ గోల్‌కు అనుమతించారు. పెనాల్టీ గోల్‌లో కొట్‌పాడ్ 7 గోల్స్ చేయ గా, మొకాపుట్ 6 గోల్స్ చేయగలిగింది. కొట్‌పాడ్ సమితి గిర్ల టీమ్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ రిఫరీలుగా జెనా, డేవిడ్, బిజయ్, రుణ వ్యవహరించారు. మోర్నింగ్ క్లబ్ అధ్యక్షుడు మున మహపాత్రో నేతృత్వంలో క్లబ్ సభ్యులు టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో 8 టీమ్‌లు పాల్గొంటున్నా యని నిర్వాహకులు వెల్లడించారు.


