జయపురం: నిషా ముక్త సమాజ నిర్మాణానికి సామూహిక ఉద్యమం అవసరమని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి పోలీసు అధికారి లక్ష్మీ నారాయణ ముదులి అన్నారు. బొయిపరిగుడ పోలీసుస్టేషన్ సభాగృహంలో జరిగిన నిశాముక్త సమాజ్ సమావేశంలో ప్రధాన లక్ష్యాన్ని పోలీసు అధికారి లక్ష్మీనారాయణ ముదులి వివరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార్ గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార్ గుప్త మాట్లాడుతూ బొయిపరిగుడ సమితి గ్రామాల్లో మద్యం వలన సమాజ వాతావరణం కలుషితమవుతోందన్నారు. సారా అమ్మకాలను అరికట్టటంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షుడు పూర్ణిమ బారిక్, సమితి సభ్యులు మంజులత పట్నాయిక్, బొయిపరిగుడ గ్రామ పంచాయతీ సర్పంచ్ సూర్యమణి నాయిక్, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి జగన్నాథ్ బిశాయి తదితరులు పాల్గొన్నారు.


