చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

రాయగడ: బాలల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో స్థానిక లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. క్లబ్‌ అధ్యక్షురాలు కస్తూరీ సాహు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల నుంచి 25 మంది విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. రాష్ట్రపతి పురష్కార గ్రహీత డాక్టర్‌ ద్వితిచంద్ర సాహు, గవర్నర్‌ పురష్కార గ్రహీత జగదీష్‌ చంద్రదొన న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సీనియర్‌ విభాగంలో ఇప్పిలి శ్రీషా ప్రథమ, శీతల్‌ సాంజ్ఞా రథ్‌ ద్వితీయ, శ్రీజమ్‌ కుండు తృతీయ స్థానాలు సంపాదించుకున్నారు. అదేవిధంగా జూనియర్‌ విభాగంలో కె.సాయి సుహాని ప్రథమ, ఎస్వీ రుతిక ద్వితీయ, హ్యాన్స్‌ వారణాసి తృతీయ స్థానాలు గెలుపొందారు. క్లబ్‌ సీనియర్‌ సభ్యులు అలకా దాస్‌, శాంతి కుమారి దేవ్‌ మార్గదర్శనం చేయగా కార్యదర్శి జ్యోతిప్రభా మహాపాత్రో, సంయుక్త కార్యదర్శి సుజాత పాడి, కోశాధికారి బి.లక్ష్మి, సంయుక్త కోశాధికారి కె.శోభారాణి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement