రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటండి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటండి

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో తుదివరకు పోరాడి విజయతీరాలకు చేరాలని జిల్లా స్కూల్‌గేమ్స్‌ సెక్రటరీలు చల్లా జగదీష్‌, జీఎం జ్యోతిరాణి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం వేదికగా ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 బాలికల క్రికెట్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల క్రికెట్‌ జట్టు ఆదివారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లింది. వీరికి జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలో వీడ్కోలు పలికారు. క్రీడాదుస్తులను పంపిణీచేయడంతో పాటు రానుపోను ఖర్చుల కోసం అవసరమైన అలవెన్సులు అందజేశారు. కర్నూలు డీఎస్‌ఏ స్టేడియం వేదికగా నవంబర్‌ 2, 3 తేదీల్లో జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 బాలబాలికల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు సైతం శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పయనమయ్యారు. వీరికి ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీలు జగదీష్‌, జ్యోతిరాణి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పీడీలు ఎం.ఆనంద్‌కిరణ్‌, కె.మాధవరావు, రెడ్డి రవి, పురుషోత్తం, మహిళా క్రికెట్‌ కోచ్‌ హారిక యాదవ్‌, కోచ్‌మేనేజర్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement