అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేశఖండన శాలలో ఎప్పటిలాగానే అదనపు వసూళ్లు యథాతథంగా కొనసాగాయి. ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో లడ్డూల సంఖ్య తగ్గించేయడంతో భక్తులంతా అరసవల్లిలో 5 నుంచి 10 వరకు ఒక్కొక్కరు లడ్డూలను కొనుగోలు చేయడం కనిపించింది. అయ్యప్పస్వాములు కూడా ఆదిత్యున్ని పెద్ద సంఖ్యలో దర్శించుకుని అన్నప్రసాదాలను స్వీకరించారు. పలువురు భక్తులు ప్రత్యేక సూర్యనమస్కారాలు చేయించుకున్నారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.


