రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికరపాయి ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మూడు ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన గజరాజు గ్రామాల్లో ప్రవేశించి సంచరిస్తోంది. శనివారం రాత్రి సికరపాయి గ్రామంలో ఏనుగు సంచరించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా సికరపాయి కొండ ప్రాంతంలో మూడు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వీటిలో ఒకటి గుంపు నుంచి విడిపోయి తొలుత కదలిచువా గ్రామ సమీపంలో కనిపించింది. అనంతరం పొడచువా–విజయనగరం మధ్యనున్న కొండ ప్రాంతంలో తలదాచుకుంది. తాజాగా శనివారం రాత్రి సికర పాయి గ్రామంలోని వీధుల్లో సంచరించింది. సమా చారం తెలుసుకున్న అటవీ శాఖ, విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రంతా అక్కడే ఉండి ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేందుకు ప్రయత్నించారు. అయి తే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఏనుగు గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.


