పర్లాకిమిడి: జిల్లాలో రాయఘడ బ్లాక్‌లో వరదలకు కొయిపూర్ వంతెన సైడ్‌వాల్ కూలిపోవడంతో వాటిని మట్టి బస్తాలతో పూడుస్తూ మరమ్మతు పనులను పర్లాకిమిడి రోడ్లు–భవనాల శాఖ అధికారులు యుద్ధ ప్రాతికపదిన చేపడుతున్నారు. సకాలంలో ప్రభుత్వం ఎఫ్‌డీఆర్ నిధులు మంజూరు చేస్తే పూర్తిస్థాయిలో అప్రోచ్ రోడ్లు, వంతెన మరమ్మతులు చేపడతామని ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ అభిషేక్ శెఠి తెలియజేశారు.
మరమ్మతులు పరిశీలన
అర్నబ్ ప్రభావంతో రాయఘడ బ్లాక్‌లో కోయిపూర్ నుంచి మహేంద్రగిరి రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించిపోయాయి. దీతో కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, సబ్ కలెక్టర్ భగవత్ సామల్ కల్యాణ్‌రావ్‌లు ద్విచక్ర వాహనంపై గంగాబడ పంచాయతీలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆర్‌డీ శాఖ ఇంజినీర్లుతో మాట్లాడి జేసీబీలతో కొండరాళ్లు, మట్టిని పక్కకు తొలగించారు. ప్రస్తుతం కొయిపూర్ నుంచి మహేంద్రగిరికి వెళ్లేందుకు యుద్ధప్రాతికపదిన పనులు చేయించి రోడ్డును క్లియర్ చేశారు. దీంతో కొయిపూర్, తుంబ, బరంపురం రోడ్డు క్లియర్ అయ్యిందని అధికారులు తెలియజేశారు.


