తుఫాన్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

తుఫాన్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

రాయగడ: తుఫాన్‌ను ఉద్దేశించి సామాజిక మాద్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేసినా వదంతులు సృష్టించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పొరిడ హెచ్చరించారు. అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జీరొ క్యాజువాలటీ లక్ష్యంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. తుఫాన్‌ ముందస్తు సన్నద్ధత, సహాయక చర్యలు, విపత్తు అనంతర పునరుద్ధరణ కార్యక్రమాలపై మంగళవారం నాడు ఆమె జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. రాయగడ జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.సుదర్శన్‌ చక్రవర్తి, జిల్లా కలక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి, ఎస్‌ఫి రాజ్‌ ప్రసాద్‌, అటవీ శాఖ అధికారి సచిన్‌ అన్నా సాహెబ్‌ అహలే, తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని సమితుల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ సమీక్షలో భాగమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న సున్నిత ప్రాంతాల్లో సహాయక చర్యల కొసం 45 జేసీబీలతో పాటు అవసరమైన ఇతర యంత్రాలను సిద్ధంగా ఉంచామని, ఈ సందర్బంగా జిల్లా కలక్టర్‌ కులకర్ణి వివరించారు. ముఖ్యంగా గుమ్మఘాటి వద్ద కొండచరియలు విరగిపడి రాకపొకలకు అంతరాయం కలిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఘాట్‌ ఇరువైపులా ఉన్న గుమ్మ పంచాయితీ కార్యాలయం, కుంభికొట వద్ద హైడ్రాలిక్‌ క్రేన్‌లు, జేసీబీలు అందుబాటులో ఉంచామని వివరించారు. జీరో క్యాజువాలిటీ లక్ష్యంగా అధికారులు తమ విధులను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఉపముఖ్యమంత్రి ప్రభాతి పొరిడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement