‘వనరులు దోచుకునేందుకే కొఠియాపై కన్ను’ | - | Sakshi
Sakshi News home page

‘వనరులు దోచుకునేందుకే కొఠియాపై కన్ను’

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

‘వనరులు దోచుకునేందుకే కొఠియాపై కన్ను’

కొరాపుట్‌: ఒడిశాలో అంతర్భాగమైన కొఠియాలో ఉన్న ప్రకృతి వనరులపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కన్ను పడిందని రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ ఆరోపించారు. మంగళ వారం భారీ తుఫాన్‌ మధ్య కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీని సందర్శించారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ ఒడిశాలో ఆంధ్ర ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఏంటని మండి పడ్డారు. 1936లో ఆవిర్భవించిన ఒడిశాలో నాటి నుండే కొఠియా ఉందని ప్రభుత్వ నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. 1956 ఏర్పడిన ఆంధ్రాలో కొఠియా ఉందని వాదించడం మూర్ఖత్వమన్నారు. ఈ ప్రాంతం పై ఇన్నాళ్లు ఊరుకొని ఇప్పడు కావాలనడం వెనుక కుట్ర ఉందన్నారు. ఇప్పటికే కొఠియా లో ఒడిశా సర్పంచ్‌, జిల్లా పరిషత్‌, వార్డు సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఇప్పుడు ఆంధ్రా ముందు మౌనం వహించడం అవకాశ వాదం గా అభివర్ణించారు. ఈ సమస్య పై ఆంధ్రా తో చర్చలు జరపాలని బీజేపీకి సవాల్‌ విసిరారు. ప్రభుత్వం కొఠియాకి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలన్నారు. పర్యటనలో కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్ర ఖఢం, కొరాపుట్‌ ఎంపీ, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడు సప్తగిరి ఉల్క, జయపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ భాహీనీ పతి, లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే పవిత్ర శాంత,రాష్ట్ర మహిళా కాంగ్రేస్‌ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, కొరాపుట్‌ డీసీసీ అధ్యక్షుడు రుపక్‌ తురుక్‌,దుర్గా ప్రసాద్‌ శర్మలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement