కొరాపుట్: అప్పర్ ఇంద్రావతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రధాన రిజర్వాయర్ని నబరంగ్పూర్ జిల్లా నూతన కలెక్టర్ మధుస్మిత పరిశీలించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర పర్యటనకు వివాదాస్పద ఇంద్రావతి రిజర్వాయ్ వేదికయ్యింది. ఇటీవల ఇంద్రావతి రిజర్వాయర్ గేట్లు ముందస్తు ప్రకటన లేకుండా ఎత్తివేయడంతో కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి. దీనికి ఇంద్రావతి ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న వోహెచ్పీసీ బాధ్యత వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. బాధితులకు వోహెచ్పీసీ పరిహారాలు చెల్లించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజర్వాయర్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పక్కనే ఖాతీగుడ డ్యామ్ సందర్శించారు. అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు 10 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కలెక్టర్ దృష్టిలో పెట్టారు. ఈ సమస్యపై పూర్తి నివేదిక ఇవ్వాలని తాను ఆర్థిక శాఖకి ఫైల్ పంపుతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. నదికి ఇరువైపులా రక్షణ చర్యలు కోసం పూర్తి డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ ప్రాంత అభివృద్ధి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. క్యాచ్మెంట్ ఏరియాలో ప్రజలు ఇబ్బందుల పడకూడదని కలెక్టర్ పేర్కొన్నారు.


