భువనేశ్వర్: అక్టోబర్ 8న ఒడిశాలో బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ బినయతోష్ మిశ్రా బుధవారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంద్ సమయంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలపై చర్చించారు. స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచా రం సేకరించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ఇతర కీలక ప్రాంతాల్లో గస్తీ, వాహనాల తనిఖీలు పెంచాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలన్నా రు. హింస, విధ్వంసం, బలవంతపు దుకాణాల మూసివేత, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏడీజీ రాజేష్ కుమార్, డీఐజీలు జుగల్ కిషోర్ కుమార్ బనోత్, మడకర్ సందీప్ సంపద్, ఎస్పీ వివేకానంద శర్మ, ఏఐజీపీ ప్రభాశంకర్ నా యక్, ఏడీజీ అరుణ్ బోత్రా, రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలు, భువనేశ్వర్, కటక్ డీసీపీలు, క టక్, రూర్కెలా ఎస్‌ఆర్‌పీ అధికారులు పాల్గొన్నారు.


