బొరిగుమ్మ చేరిన సైకిల్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

బొరిగుమ్మ చేరిన సైకిల్‌ యాత్ర

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

జయపురం: పశువులు, పక్షుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన సందేశ్‌ గుప్తా సైకిల్‌పై దేశ సంచార యాత్ర చేపట్టారు. బుధవారం జయపురం సబ్‌డివిజన్‌ బొరిగుమ్మకు చేరిన ఆయనకు జి.మోహణ దొర, కమళా కాంత బిశ్వాల్‌, పి.రమేష్‌, మానస రథ్‌ తదితరులు స్వాగతం పలికారు.

మరో నిందితుడు అరెస్ట్‌

పర్లాకిమిడి: గజపతి జిల్లా అటవీ శాఖలో 2022లో పనిచేసి అనుమానాస్పదంగా మృతిచెందిన అసిస్టెంట్‌ అటవీ సంరక్షణ అధికారి సౌమ్యరంజన్‌ మహాపాత్రో హత్య కేసులో మరో (రెండో) ముద్దాయి వంటవాడు మన్మథ కుంబో తన స్వగ్రామంలో బుధవారం ఉదయం పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌.డి.జె.ఎం కోర్టులో మన్మథ కుంబోను పర్లాకిమిడి ఆదర్శ పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాం కేసరి బెహరా పర్లాకిమిడి ఉపకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు. మూడో నిందితురాలు, ఏ.సి.ఎఫ్‌. సౌమ్యరంజన్‌ మహాపాత్రో భార్య బిద్యాభారతి పండా స్పెషల్‌ లీడ్‌ పిటిషన్‌ కూడా సుప్రీం కోర్టులో కొట్టివేశారు. దీంతో ఆమె కూడా పోలీసులు ఎదుట లోంగి పోవాల్సి ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌కుమార్‌ మిశ్రా తెలియజేశారు.

దోపిడీ కేసులో నలుగురు అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్‌ సమితికి చెందిన జూనియర్‌ ఇంజినీర్‌ కై రా పూర్తి గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నలుగురు దోపిడీదారులను మంగళవారం రాత్రి మల్కన్‌గిరి పోలీసులు అరేస్టు చేశారు. ఈ ఏడాది ఆగెస్టు 27వ తేదీన సుభాష్‌ చౌక్‌ వద్ద ప్రేమ్‌ ఖోరా, అతని ముగ్గురు సహచారులు కలిసి తనపై దాడి చేసి దూషించారని కై రా పూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.1,00,000 డిమాండ్‌ చేశారని, ఫోన్‌ పే ద్వారా బలవంతంగా 2,000 తీసుకున్నారని, రూ.50,000 చెక్కు, ఫోన్‌ లాక్కున్నారని కై రా పూర్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. సునాధర్‌ ఖరా, శంకర్‌ నాయక్‌, ఆయుబ్‌ ఖాన్‌, వినోద్‌ గదభను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి విచారణ అనంతరం నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ప్రభుదత్తు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement