మల్కన్‌గిరి: మల్కన్‌గిరి అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సాంస్కృతిక భవన్‌లో 72వ జిల్లా స్థాయి వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీ విభాగ అధికారి సాయికిరణ్ డీఎన్ ప్రత్యేక పర్యవేక్షణలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, మానవ– వన్యప్రాణుల సుహృద్భావ సహజీవనం అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కే, ఎస్పీ వినోద్ పటేల్, ఎంపీ ప్రతినిధి సంజాయ్ సర్కార్, మల్కన్‌గిరి ఫారెస్టు రేజర్ రమేష్ చంద్రరౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి, వన్యప్రాణులు లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు.


