రైళ్ల సేవల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

రైళ్ల సేవల్లో మార్పులు

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే పరిధి రాయగడ మండలంలో మలిగుడ, ఛత్తారిపుట్‌ స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడటం వల్ల రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. భద్రతా కారణాలు, పునరుద్ధరణ పనుల నేపథ్యంలో కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్ల సేవలు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

రద్దు చేసిన రైళ్లు..

అక్టోబర్‌ 1, 2 తేదీల్లో 18107 రూర్కెలా – జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 2, 3 తేదీల్లో 58502 కిరండల్‌– విశాఖపట్నం ప్యాసింజర్‌, 58501 విశాఖపట్నం – కిరండల్‌ ప్యాసింజర్‌, 18516 కిరండల్‌ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, 18515 విశాఖపట్నం – కిరండల్‌ ఎక్స్‌ప్రెస్‌, 18108 జగదల్‌పూర్‌ – రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలను రద్దు చేశారు.

పాక్షికంగా రద్దు..

అక్టోబర్‌ 1న హౌరా నుంచి బయలుదేరే 18005 హౌరా – జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవల్ని కొరాపుట్‌ వరకు పరిమితం చేశారు. కొరాపుట్‌, జగదల్‌పూర్‌ మధ్య ఈ రైలు సేవలు పాక్షకింగా రద్దు చేయబడతాయి. అక్టోబర్‌ 1, 2 తేదీల్లో భువనేశ్వర్‌ నుంచి బయలుదేరాల్సిన 18447 భువనేశ్వర్‌ – జగదల్‌పూర్‌ హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు కొరాపుట్‌ వరకు పరిమితం చేస్తారు. ఆయా రోజుల్లో కొరాపుట్‌, జగదల్‌పూర్‌ మధ్య ఈ రైలు సేవలు రద్దు చేయబడతాయి. అక్టోబర్‌ 2, 3 తేదీల్లో జగదల్‌పూర్‌ నుంచి బయలుదేరాల్సిన 18448 జగదల్‌పూర్‌ – భువనేశ్వర్‌ హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొరాపుట్‌ నుంచి బయల్దేరడంతో జగదల్‌పూర్‌, కొరాపుట్‌ మధ్య ఈ రైలు సేవలు రద్దు అవుతాయి. అక్టోబర్‌ 2, 3 తేదీల్లో జగదల్‌పూర్‌ నుంచి బయలుదేరాల్సిన 18006 జగదల్‌పూర్‌ – హౌరా ఎక్స్‌ప్రెస్‌ కొరాపుట్‌ నుంచి బయల్దేరడంతో జగదల్‌పూర్‌, కొరాపుట్‌ మధ్య సేవలు పాక్షకింగా రద్దు అవుతాయి.

మీనాక్షి బాహిణిపతికి అస్వస్థత

కొరాపుట్‌: రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఆ సమ యంలో పోలీసులతో జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జయపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహిణిపతి, కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఆమెను రాజధానిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తారా ప్రసాద్‌ బాహిణిపతి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement