పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో అనాధ బాలాశ్రమాల బాలబాలికలకు బుధవారం గజపతి స్టేడియంలో ఆటల పోటీలు, క్విజ్, డ్యాన్సు, సంగీతం, రన్నింగ్ రేస్ వంటి 13 ఈవెంట్లు నిర్వహించారు. సాయంత్రం స్థానిక బిజూ కళ్యాణ మండపంలో శిశు మహోత్సవం 2026 సందర్భంగా ఉత్సాహం, మహాక్ పేరుతో బాలబాలికలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో ముఖ్యఅతిథిగా జిల్లా సివిల్ కోర్టు రిజిస్ట్రార్ సత్యభ్రత రోణా, జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాడీ, సీడబ్ల్యూసీ చైర్మన్ అమియా కుమార్ త్రిపాఠి, డీసీఓ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా ప్రొటెక్షన్ అఽధికారి సరలా పాత్రో, డీసీఓ అర్చనా మంగరాజ్ విచ్చేశారు. అనాథ బాలబాలికలు చూపిన ప్రతిభను జిల్లా పరిషత్ సీడీఓ కొనియాడారు. అనంతరం, వివిధ పోటీల్లో విజేతలైన బాలబాలికలకు బహుమతులను కోర్టు రిజిస్ట్రార్ సత్యభ్రత రోణా చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బాలశ్రమాల విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.


