వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన | - | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

కొరాపుట్‌: వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష బీజేడీ నాయకులు విస్తృత పర్యటన చేశారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కొసాగుమ్డ సమితిలో బీజేడీ ప్రతినిధి బృందం పర్యటించి నష్టపోయిన పొలాలు, కూలిన ఇళ్లు, గోతులుపడిన రోడ్లను పరిశీలించారు. పార్టీ తరఫున ఆహారం, టార్పాలిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రమేష్‌ చంద్ర మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, బొడ బాబు తదితరులు పాల్గొన్నారు. అధికార బీజేపీ తరపున నబరంగ్‌పూర్‌ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జిలు పర్యటించారు. నష్టం, పరిహారం వివరాలను ఎంపీకి ఎమ్మెల్యే వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement