పర్లాకిమిడి: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతందని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. రాయగడ జిల్లా హాట్టోమునిగుడ ఎస్.ఎస్.డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్లాకిమిడి అస్మితా సెపక్ తక్రా సిటీ లీగ్ 2026–27 పోటీలను ముఖ్యఅతిథిగా పాల్గొని సోమవారం ప్రారంభించారు. అస్మితా లీగ్ పోటీలకు గజపతి, రాయగడ జిల్లాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. అంతేకాక భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ ప్రతిభను చాటాలన్నారు. విజేతలైన పలువురు విద్యార్థులకు మెమొంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


