మల్కన్‌గిరి: చిత్రకొండ సమితిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సమావేశం అయ్యారు. ముందుగా భారీ ర్యాలీ చేపట్టారు. చిత్రకొండ సమితిలోని 14 పంచాయతీలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గిరిజనులు కూడా భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, ప్రజల సమస్యలపై చర్చించారు. చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిత్రకొండ సమితిలోని కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందించి రోడ్డు సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోవిందపాత్రో తదితరులు పాల్గొన్నారు.


