మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు బైక్, సేల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. కలిమెల సమితి బడుగూఢ గ్రామానికి చెందిన నీలకంఠ మండల్ సోమవారం రాత్రి తన బైక్, సెల్‌ఫోన్ చోరీకి గురైందని మంగళవారం ఉదయం కలిమెల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐఐసీ ప్రభుదత్తు బిశ్వల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మల్కన్‌గిరి సమితి యం.వి.8 గ్రామానికి చెందిన నీలకంఠ మండాల్ చోరీకి పాల్పడినట్టు గుర్తించి అతన్ని అరెస్టు చేసి.. బైల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టుకు తరలించారు.


