ప్రోత్సాహం సున్నా! | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం సున్నా!

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం సున్నా! ● విరిగిన స్టిక్‌, చెప్పుల్లేకుండానే హాకీ సాధన ● క్రీడాకారులకు అందని సౌకర్యాలు ● పాలకుల తీరుపై విమర్శలు

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
ప్రతిభ ఉన్నా..
● విరిగిన స్టిక్‌, చెప్పుల్లేకుండానే హాకీ సాధన ● క్రీడాకారులకు అందని సౌకర్యాలు ● పాలకుల తీరుపై విమర్శలు

రాయగడ: హాకీలొ రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలనే పట్టుదల ఉన్నా కనీస క్రీడా సామగ్రీ అందుబాటులో లేకపొవడంతో అనేక మంది ఔత్సాహిక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో చిన్నారుల్లో హాకీ ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారు. హాకీ షూలు లేక కొందరు కాళ్లతోనే సాధన చేస్తున్నారు. మరికొందరు చెప్పులు వేసుకుని ప్రాక్టీసు చేయాల్సిన పరిస్థితి. గతంలొ అందించిన షూలు చిరిగిపొవడం, మరికొందరి వద్ద పూర్తిగా లేకపొవడంతో ప్రాక్టీస్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. మరో జత షూలు లేకపొవడంతో ఉన్న వాటిని ప్రధాన పోటీల కోసం దాచుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు ఏడాది కాలంగా క్రమం తప్పకుండా హాకీ సాధన చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రెండు స్టేట్‌ గ్రాస్‌రూట్‌ హాకీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకటి స్థానిక గోవింద చంద్రదేవ్‌ ఉన్నత పాఠశాల మైదానం, మరొకటి బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. ఈ రెండు కేంద్రాల్లో సుమారు 80 నుంచి 100 మంది విద్యార్థులు హాకీ శిక్షణ పొందుతున్నప్పటికీ అవసరమైన క్రీడా సామగ్రి మాత్రం పూర్తిస్థాయిలొ అందుబాటులో లేదని తెలుస్తొంది.

షూలు లేక ఖాళీ కాళ్లతోనే..

తొమ్మిదో తరగతి విద్యార్థి రాహుల్‌ తాడింగి, ఏడో తరగతి విద్యార్థి సుశాంత్‌ జగరంగలు మాట్లాడుతూ.. హాకీ అంటే తమకు ఎంతో ఇష్టమని, అయితే అవసరమైన సామగ్రీ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. షూలు లేకుండా సాధన చేస్తే గాయాలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలన్న తమ కల కోసం ప్రతీరోజూ సాధన కొనసాగిస్తున్నామని చెప్పారు.

పాత సామగ్రితోనే శిక్షణ

స్థానిక గోవింద చంద్ర దేవ్‌ ఉన్నత పాఠశాల మైదానంలో హాకీ శిక్షణ ఇస్తున్న కోచ్‌ అమిత్‌టప్నొ మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం అందించిన క్రీడా సామగ్రీతోనే ప్రస్తుతం విద్యార్థులు సాధన చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు చాలామంది ఉన్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గోల్‌పోస్టు ఏదీ..?

హాకీ సాధనకు సరైన మైదానం లేక మరో సమస్యగా మారింది. విద్యార్థులు సాధన చేసే ప్రదేశంలో కనీసం ఒక గోల్‌పొస్ట్‌ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. హాకీ స్టిక్స్‌ చాలా వరకు విరిగిపోయాయాని క్రీడాకారులు చెబుతున్నారు. ఈ మైదానంలో స్థానికులు కూడా ఉపయోగిస్తుండటంతో విద్యార్థుల సాధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేంద్రాల్లో సాధన చేస్తున్న కొంతమంది విద్యార్థులు సబ్‌జూనియర్‌ , జూనియర్‌ విభాగాల్లో రాయగడ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement