రాయఘడ బ్లాక్‌లో ఘటన
దగ్ధమైన ముఖ్యమైన ఫైళ్లు,
కంప్యూటర్లు
పర్లాకిమిడి: జిల్లాలోని రాయఘడ బ్లాక్ ఆవరణలో ఉన్న గ్రామీణ గృహ నిర్మాణ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కార్యాలయంలోని అనేక దస్తావేజులు, ముఖ్యమైన ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు కాలిపోయాయి. అయితే షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదరం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం సంభవించిన కొద్ది క్షణాల్లోనే కార్యాలయం అంతా మంటలు వ్యాపించాయి. ప్రభుత్వ అధికారులు, స్థానికులు అగ్నిమాపక దళానికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నష్టం, ఎన్ని ముఖ్యమైన ఫైళ్లకు నష్టం వాటిల్లిందో తెలియజేయాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు.


