పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
కల్యాణసింగుపూర్‌

లొద్దసికక అరెస్టుపై తీవ్ర నిరసన

రాయగడ: నియమగిరి సురక్షా సమితి అధ్యక్షుడు లోద్ద సికక అరెస్టును నిరసిస్తూ ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నియమగిరి ప్రాంతానికి చెందిన వందలాది డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు శుక్రవారం నాడు కళ్యాణసింగుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. వారి సంప్రదాయ ఆయుధాలతో గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి వారెంట్‌ లేదా నోటీసు చూపకుండా పోలీసులు లోద సికకను తీసుకువెళ్లారని డొంగిరియా ఆదివాసీలు ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరొవైపు లోద్ద సికక పై రాయగడ జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. కోర్టు నుంచి పలుమార్లు రిమైండర్లు వచ్చిన అనంతరం, చట్ట ప్రకారం వారెంట్‌ను అమలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలాఉండగా నోటీసు ఇవ్వకుండా లోద్ద సికకను అరెస్టు చేయడం తామంతా వ్యతిరేకిస్తున్నామని డొంగిరియాలు ఆరొపించారు. జల్‌ జంగల్‌, జమీన్‌ రక్షణ కోసం తమ పొరాటం కొనసాగుతుందని అన్నారు. ఆయనను విడుదల చేయపొతే ఈ నిరసన పెద్ద ఉద్యమంగా మారుతుందని నిరసన కారులు అన్నారు.

నియమగిరి ఉద్యమంలో కీలక పాత్ర

నియమగిరి కొండల పరిరక్షణ కొసం ప్రారంభమైన ఉద్యమంలో లోద్ద సికక కీలక పాత్ర పొషించారు. ఆయన నాయకత్వంలో నియమగిరి సురక్షా ఆధ్వర్యంలో గిరిజనులు తమ భూమి, అడవులు, కొండల పరిరక్షణ కొసం ఉద్యమాన్ని కొనసాగించారు. నియమగిరి కొండల్లో బాకై ్సట్‌ తవ్వకాలను వ్యతిరేకంగా జరిగిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంఽశమైంది. తదుపరి నియమగిరి కొండల్లో మైనింగ్‌ కార్యకలా పాలు నుంచి వేదాంత సంస్థ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోద్ద అరెస్టు మరోసారి నియమగిరి ప్రాంతంలో చర్చకు దారితీసింది.

ఎస్పీ ఏమన్నారంటే...

నియమగిరి సురక్షా సమితి అధ్యక్షుడు, ప్రముఖ గిరిజన ఉద్యమ నాయకుడు లొద్ద సికక అరెస్టు చేయడం నిజమేనని ఎస్పీ రాజ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆయనపై జిల్లాలో కళ్యాణసింగుపూర్‌, అంబొదల, మునిగుడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 11 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. కోర్టు నుంచి వారెంట్లు కూడా జారీ కావడంతోనే పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. లోద్ద సికక పై క్రిమినల్‌ కేసులు నమోదవ్వడంతో పాటు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కావడం లేదని తెలి పారు. దీంతో కోర్టు వా రెంట్ల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని అన్నారు. కలహండి జిల్లా లో నమోదైన ఓ కేసులో లోద్ద సికక బెయిల్‌ పొందిన అనంతరం తిరిగి వస్తుండగా కళ్యాణసింగుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన అనంతరం సికకను కొర్టుకు తరలించామని ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement