కొరాపుట్:
నబరంగ్‌పూర్ జిల్లాలో వివిధ పార్టీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. నందాహండి సమితి డొంగ్రుభజ గ్రామ పంచాయతీ సన్న మాలిగుడ గ్రామానికి చెందిన 51 కుటుంబాలు బీజేపీలో చేరారు. వీరందరూ వివిధ పార్టీల్లో క్రియాశీలక కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వీరికి బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధి చూసి తాము పార్టీలో చేరినట్లు కార్యకర్తలు ప్రకటించారు.


