విద్యుత్‌ షాక్‌తో రైతు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు దుర్మరణం

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

జయపురం: జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి కలియగాం గ్రామ పంచాయతీ సిరిగుడ గ్రామానికి చెందిన యువ రైతు గిరిదర మాలి విద్యుత్‌ షాక్‌తో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గిరిదర మాలి తన సొంత పొలానికి విద్యుత్‌ మోటర్‌ ద్వారా నీరు విడిచేపెట్టేందుకు మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేశాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతడు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతడిని జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ గిరిదర మాలి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. గిరిదర మాలి సోదరుడు డొంబురు మాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ అధికారి సచీంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

పర్లాకిమిడిలో

నిలిచిన బ్యాంకు సేవలు

పర్లాకిమిడి: యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్ల పిలుపు మేరకు జాతీయ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ఒకరోజు బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లాలో బ్యాంకు లావేదేవీలు నిలిచిపోయాయి. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాలు, పీఎల్‌ఐ అమలు, పింఛన్‌ అప్‌డేషన్‌, పాతపింఛన్‌ అమలు చేయాలన్న పలు డిమాండ్లతో పర్లాకిమిడిలో జాతీయ బ్యాంకు సంఘాలు భారతీయ స్టేట్‌ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు.

సబ్‌ కలెక్టర్‌గా

భగత్‌ సామల్‌ కళ్యాణ్‌ రావ్‌

పర్లాకిమిడి: రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను వివిధ జిల్లాలకు సబ్‌ కలెక్టర్‌, మేజిస్ట్రేట్లుగా నియమించింది. పర్లాకిమిడి సబ్‌ కలెక్టర్‌గా భగత్‌ సామల్‌ కళ్యాణ్‌రావ్‌ నియమితులయ్రరు. జయపురానికి సుభధ్ర పండా, పవన్‌కుమార్‌ (టిట్లాఘడ్‌), అనిమేష్‌ ప్రధాన్‌ (అఠఘడ్‌), ప్రజ్ఞానందన్‌ గిరి తాల్చేర్‌, కస్తూరిషా (భవానీపట్న), ఫబీ రషీద్‌ (కోరాపుట్‌), మ్రినాలికా రాథోడ్‌ (రాయగడ), సంతోష్‌ కుమార్‌ పాత్రో (బోనాయిఘడ్‌)లు నిమమితులయ్యారు. ప్రస్తుత పర్లాకిమిడీ సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా రాష్ట్ర సెక్రటరేట్‌కు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement