నందన్‌కానన్‌ జూలో ఒరాంగుటాన్లు క్షేమం | - | Sakshi
Sakshi News home page

నందన్‌కానన్‌ జూలో ఒరాంగుటాన్లు క్షేమం

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

భువనేశ్వర్‌: బాలేశ్వర్‌ జిల్లా అడవుల నుంచి తీసుకువచ్చిన 5 ఒరాంగుటాన్‌ పిల్లలు స్థానిక నందన్‌ కానన్‌ జంతు ప్రదర్శన శాల సంరక్షణలో క్షేమంగా ఉన్నాయని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (వన్యప్రాణి), ఒడిశా అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఝా శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం నందన్‌ కానన్‌ జంతు ప్రదర్శన శాల సంరక్షణలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని వివరించారు. జంతువుల మనుగడ, సంక్షేమాన్ని నిర్ధారించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు కొన్ని రోజుల క్రితం బారంగ్‌ నందన్‌ కానన్‌ జంతు ప్రదర్శన శాలకు చేరిన 5 ఒరాంగుటాన్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. వాటికి పూర్తిస్థాయి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో జంతువు ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. వాటి ఆరోగ్య పరిస్థితి నిర్ధారణ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి లేదా ఎలా వచ్చాయి అనే విషయాలపై ఏకకాలంలో విచారణ జరుపుతామని ఆయన పేర్కొన్నారు. నందన్‌కానన్‌లోని కొత్త వాతావరణానికి ఒరాంగుటాన్‌లు క్రమంగా అలవాటు పడటానికి తగిన చర్యలు చేపడుతున్నారు. సానుకూలమైన పరిసరాలు, పర్యావరణం కల్పించి కోలుకునేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయన్నారు. అవి పూర్తిగా కోలుకున్న తర్వాత వాటిని స్వదేశానికి తిరిగి పంపాలా లేక నందన్‌ కానన్‌లోనే ఉంచాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పీసీసీఎఫ్‌ తెలిపారు.

రాష్ట్రంలో తారస పడిన ఒరాంగుటాన్‌ల మూలం, వాటిని ఒడిశాకు ఎవరు తీసుకు వచ్చారు, అవి రాష్ట్రానికి ఎలా చేరుకున్నాయి అనే విషయాలను నిర్ధారించడానికి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌), బాలేశ్వర్‌ అటవీ శాఖ మరియు వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో (డబ్ల్యుసీసీబీ) సంయుక్త దర్యాప్తు కొనసాగుతోంది.

ఇండోనేషియా లేఖ

బాలాసోర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ నెల 8న తారసపడిన 5 ఒరాంగుటాన్లను ప్రభుత్వ పర్యవేక్షణలో అక్కున చేర్చుకుని చేరదీశారు. వాటిని ఆలన పాలన నగరం శివార్లు బారంగ్‌ నందన్‌ కానన్‌ జంతు ప్రదర్శన శాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒరంగుటాన్‌లను తిరిగి అప్పగించాలని కోరుతూ ఇండోనేషియా ప్రభుత్వం భారత సీఐటీఈఎస్‌ అధికారులకు లేఖ రాసింది. ఈ జంతువులకు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షలో అవి ఇండోనేషియాకు చెందినవని నిర్ధారణ అయితే, ఆ జంతువులను స్వదేశానికి తిరిగి పంపాలని ఇండోనేషియా ప్రభుత్వం రాసిన లేఖలో భారత ప్రభుత్వానికి అభ్యర్థించింది. ఈ విషయంలో భారత దేశం అధికారులతో సహకరించడానికి, సమన్వయం చేసుకోవడానికి ఇండోనేషియా అటవీ శాఖ సుముఖతను వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement