మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

మరమ్మతులు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
ఏఓబీ వంతెనకు ..

పర్లాకిమిడి:

డిశా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులను కలుపుతూ 2018–19లో మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మహేంద్రతనయ నదిపై వంతెన ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. ఈ వంతెన రూ.7.35 కోట్లతో రెండు స్పాన్లతో 7.50 మీటర్లు పొడవుతో నిర్మించిన వంతెన ఏనిమిదేళ్లకే కాంక్రీట్‌ శ్లాబ్‌ శిథిల దశకు చేరింది. ఈ వంతెన మరమ్మతులపై పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అనేక సార్లు స్పాట్‌ విజిట్‌ చేసి ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీరుకు పలు సూచనలు చేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ వంతెనపై అనేక చిన్నా, పెద్దా వాహానాలు రాకపోకలు సాగిస్తున్నందున భారీ వాహనాలు వెళ్లినప్పుడు కదలిక వస్తున్నది. పురప్రముఖులు, ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి ఈ వంతెనకు మరమ్మతులు చేయాలని భువనేశ్వర్‌లో చీఫ్‌ ఇంజినీర్‌ను కోరిన మీదట ప్రస్తుతం రూ. 32 లక్షలతో వంతెన మరమ్మతులు చేపడుతున్నట్టు రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండెంట్‌ అభిషేక్‌ శెఠి తెలిపారు. అప్పట్లో గజపతి మహారాజా కృష్ణచంద్రగజపతి హయాంలో 1859తో నిర్మించిన మహేంద్రతనయ వంతెన ఉభయ ఒడిషా ఆంధ్ర రాష్ట్రాలకు వారధిగా నిలిచింది. ఆ పాత వంతెనకు తిరిగి మరమ్మతులు చేపడితే ద్విచక్రవాహనాలకు ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ వంతెన సురక్షితం కాదని అప్పట్లోనే ఇంజినీర్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement