జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం గురువారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఫ్రొఫెసర్ హృషికేష్ శనాపతి అధ్యక్షతన నిర్వహించి ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అద్యాపకులు, మహిళా అధ్యాపకులలో జ్ఞానం, నైపుణ్యం, భోదన పటిమను పెంపొందించే ప్రధాన లక్ష్యంతో అకడమిక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ వెల్లడించారు. విశ్వవిద్యాలయ ఎల్–2 హాలులో నిర్వహించిన అకడమిక్ ఫ్యాకల్టీ డవలప్‌మెంట్ ప్రొగ్రాంలో ‘పర్యావరణ సంక్షోభం.. దాని నివారణ’ అన్న అంశంపై చర్చించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రసంగిస్తూ ప్రస్తుత కాలంలో పర్యావరణ సంక్షోభం పరిష్కారానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రసాయన విభాగ అధికారి డాక్టర్ స్మిత సాగర్ శతపతి పర్యావరణ కాలుష్యంపై ప్రసంగించారు.


