రాయగడ: సదరు సమితిలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని 16 సమితి సమావేశంలో నిర్ణయించారు. సదరు సమితి సమావేశం హాల్‌లో బుధవారం జరిగిన సమావేశానికి సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆరోగ్యం, విద్య ఆర్‌ర్డీ, వ్యవసాయం, మహిళాశిశు అభివృద్ది, తాగునీరు తదితర అంఽశాలపై విస్తృతంగా చర్చించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితీ పరిధిలో ఆరవ, 16వ ఆర్థిక సంఘాల నిధులను వినియోగించేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాదికి లఘు వన ఉత్పత్తుల ధరలను కూడా నిర్ణయించారు. ప్రతీ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలొ ప్రతీ గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయంలో ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రం, గ్రంథాలయం, క్రీడా మైదానం, కమ్యూనిటీ సెంటర్, మార్కెట్ తదితర సౌకర్యాలతో కూడిన ఆదర్శ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగేే గ్రామోదయ పథఽకం కింద రాయగడ సమితిలో గుర్తించిన 49 గ్రామాల్లో ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసే అంశంపై చర్చించారు. సమావేశంలో బీడీవో సుజిత్ కుమార్ మిశ్రా, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రక, జిల్లా పరిషత్ సభ్యులు ప్రశాంత్ కలసిక, పద్మావతి మండంగి, సంధ్యా పులక, ఏబీడీవోలు కాలు చరణ్‌నాయక్, ఎంపీ ప్రతినిధి భూషణ్ బిడిక, ఎంఎల్‌ఏ ప్రతినిధి సత్యబాన్ మండంగి హాజరయ్యారు.


