రాయగడ జిల్లాలో తీవ్ర విషాదం | - | Sakshi
Sakshi News home page

రాయగడ జిల్లాలో తీవ్ర విషాదం

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

● ● సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు మృతి

రాయగడ: జిల్లాలో తీవ్ర విషాదం నెలకుంది. కొత్తగా నిర్మించిన సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాద ఘటన పద్మపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గులుగుడ పంచాయతీ తారాపడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మేసీ్త్రలు, ఒకరు దినసరి కూలీ ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డి ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగారు. అయితే ట్యాంక్‌లో ఊపిరాడక ముగ్గురూ అస్వస్థతతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పద్మ పూర్‌ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలా నికి చేరుకుని ముగ్గురినీ ట్యాంక్‌ నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులను పద్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కెందుగుడ సమీపం జీవజగత్‌పూర్‌ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర బీర్‌ (46), ప్రకాష్‌ లిమా (45), అలొక్‌ కరాడ (47)గా గుర్తించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పద్మపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement