నాలుగు లేన్లుగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

నాలుగు లేన్లుగా అభివృద్ధి

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

ప్రక్రియ కొనసాగుతోంది.

భవానీపట్నం–మునిగుడ రహదారిలో..

భవానీపట్నం–మునిగుడ రహదారిలో 26.04 కి.మీను రూ.196.18 కోట్లతో 30 గ్రామాలు, 6 పంచాయతీలు లబ్ధి పొందనున్నాయి. ఈ నాలుగు లైన్లు రహదారి ప్రాజెక్టులు రాయగడ జిల్లా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయన్నారు. రాయగడను కలహండి, కంధమాల్‌, విశాఖపట్నంతో అంతర్‌ జిల్లా, అంతర రాష్ట్ర రవాణా మార్గాల్లో మరింత అనుసంధానం చేయడంలో ఇవి కీలకంగా మారనున్నాయని తెలిపారు. రాయగడ, బిసంకటక్‌ మునిగుడ, అంబొదల రైల్వే స్టేషన్లతోపాటు పారిశ్రామిక ప్రాంతాలు విశాఖపట్నం పోర్టుకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. మెరుగైన రహదారుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్‌కు వేగంగా తరలించేందుకు వీలవుతుందన్నారు. పరశ్రమలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతం లభిస్తుందన్నారు. ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు. నాలుగు లైన్ల రహదారులను డివైడెడ్‌ హై వేలుగా నిర్మించనున్నారు. ప్రతి క్యారేజ్‌ వే వెడల్పు 7.5 మీరట్లు ఉండగా డిజైన్‌ వేగాన్ని గంటకు 80 కి.మీలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ఆమోదం తెలిపినందుకు రాయగడ జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝికి కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ రాయగడ–1 సూరింటెండెంట్‌ ఇంజినీర్‌ అంబికేయ మిశ్రా, రాయగడ–2 ఇంజినీర్‌ దుర్గామాధవ పాడీ ఉన్నారు.

రాయగడ: జిల్లాలో రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రధాన రహదారుల్లో మొత్తం 113.386 కిలో మీటర్ల మేర నాలుగు లైన్లుగా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందు కోసం సుమారు రూ.795.96 ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సమావేశం హాల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో రాయగడతో పాటు పలు గ్రామాలు, గ్రామ పంచాయతీలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా రాయగడ–కెరడ రహదారిలో 25.166 కి.మీ రూ. 186.19 వ్యయంతో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల 17 గ్రామాలు, 4 పంచాయతీలు ప్రయోజనం పొందనున్నట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి మొత్తం 17 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయినట్లు చెప్పారు. అదేవిధంగా కొమట్లపేట – మునిగుడ – తుమడిబందొ రహదారిలో 30 కి.మీ మేర నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందనున్నాయి.

ఇందు కోసం రూ.212.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రహదారి ద్వారా 20 గ్రామాలు, 8 పంచాయతీలు లబ్ధి పొందనున్నాయి. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయన్నారు. మరో 32.18 కి.మీ రూ. 201.48 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. బిసంకటక్‌ బైపాస్‌ మినహాయించి చేపట్టనున్న ఈ పనులతో 25 గ్రామాలు, 7 గ్రామ పంచాయతీలు ప్రయోజనం పొందనున్నాయి. సంబంధిత గ్రామాల్లో గ్రమ సభలు పూర్తికాగా, భూసేకరణకు సంబంధించిన తదుపరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement