జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో అకాడమిక్ ఫెకాలటీ డవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నాల్గో ఫెకాలటీ డవలప్‌మెంట్ ప్రొగ్రామ్ గురువారం నిర్వహించారు. విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హృశికేష్ శనాపతి ఆదేశం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిడుగులు, ఉరుములతో తుఫాన్‌లు రావటానికి గల కారణాలపై చర్చ జరిగింది. విక్రమదేవ్ విశ్వవిద్యాలయ జువాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఉదయ కుమార్ దాస్ ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణను వివరించారు. పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్గి ఉంటే ప్రాణ, ఆస్తి నస్టాలను నివారించవచ్చన్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంశల వారీగా చర్చించారు.


