శంకుస్థాపన.. | - | Sakshi
Sakshi News home page

శంకుస్థాపన..

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

జయపురం: జయపురం జమితి రొండాపల్లిలో గల ప్రభుత్వ పాలిటెక్నికల్‌ విద్య, శిక్షణ, సిబ్బంది నివాస మొదలగు 5 విభాగాల భవనాలకు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.194.97లక్షల వ్యయంతో పాలిటెక్నిక్‌ యంత్ర శాల భవనాలు, రూ.202.83 లక్షల వ్యయంతో కళాశాల కాంపౌండ్‌ వాల్‌, కళాశాల పాత భవనాల పునరుద్ధరణ, రూ.208.31 లక్షల వ్యయంతో బాలికల కోసం 50 పడకల నూతన హాస్టల్‌ నిర్మాణం, కళాశాల ఉద్యోగ సిబ్బందికి రూ.295.13 లక్షల వ్యయంతో రెండు ఈ బ్లాక్‌ల నివాస గృహాల నిర్మాణం, రూ.121.21 లక్షల వ్యయంతో ఉద్యోగుల కోసం 6 ఈ–టైప్‌ గృహ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యభాన్‌ మహాజన్‌, పాలిటెక్నికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement