న్యూస్‌రీల్
వసంత గీతాల ఆలాపన
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
సందడిగా ..
రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మజ్జిగౌరి మందిరంలో కొండబాబు, గజపతి జిల్లా పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే కొడూరు నారాయణరావులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిలిపిన కలశానికి పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం కలశ యాత్రను నిర్వహించారు. మజ్జిగౌరి మందిరం నుంచి ప్రారంభమైన కలశయాత్ర, ర్యాలీ కొల్లిగుడ వద్ద ఉన్న సభా వేదిక వరకు కొనసాగింది. ర్యాలీలో డప్పు వాయిద్యాలు, వివిధ వేషాధారణలు, ట్రాక్టర్లపై వేంకటేశ్వర, శ్రీరామ, వినాయక తదితర అలంకారాలతో వేషాధారణలు ఆకట్టుకున్నాయి. అడుగడుగునా బాణసంచాతో కొనసాగిన ర్యాలీ పట్టణం మెయిన్‌రోడ్డు గుండా ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా సభా వేదిక వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా జిల్లా తెలుగు సమాఖ్య కన్వీనర్ వీరబాబు ఆధ్వర్యంలో ఉదయం సభా వేదిక వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు శ్రీరేజేటి శ్రీనివాస్ శర్మ, రేజేటి శ్రీరామ శర్మల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ పఠనం జరిగింది.
జయపురంలో..
జయపురం : జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో గురువారం ఉగాది కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఆకట్టుకున్నాయి. తెలుగు సాంస్కృతిక సమితి వారి సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో నిర్వహించిన వంటల పోటీల్లో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. ఐసా గౌఢ ప్రథమ స్థ్నాంలో నిలవగా, ఎం.ఇందుమతి రెండోస్థానం, పి.శ్రావణి మూడో స్థానంలో నిలిచారు. వంటల పోటీల్లో ఎస్.సాయిశ్రీ ప్రథమ బహుమతి పొందగా, ఎస్. రమ్య రెండో బహుమతి, వి.హామినీ రెడ్డి మూడో బహుమతి సాధించారు.


