పర్లాకిమిడి: మహిళలు పని చేసే స్థలంలో ఎదుర్కొంటున్న లైంగిక దాడులు, వేధింపులపై గజపతి జిల్లాలో అతి తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, దీనికి మహిళల బలహీనత, సంఘంలో పేరుప్రతిష్టలకు ఆటంకం కలుగుతాయని వెనక్కి తగ్గుతున్నారని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో కార్యాలయాల్లో పనిచేసే మహిళలపై దాడులు, వాటి నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ పండా గురువారం ప్రారంభించారు. ఒడిశా జీవనోపాదులశాఖ, మిషన్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్‌కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ప్రజాఆరోగ్యశాఖ డాక్టర్ ప్రదీప్ కుమార్ మహాపాత్రో, జ్యువెనెల్ జస్టీస్ ప్యానల్ న్యాయవాది భాగ్యలక్ష్మీ నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ సరలా పాత్రో, ఐ.డబ్ల్యూ.ఏ డైరెక్టర్ మినాతి పాడీ, మిషన్ శస్తి, డి.పి.ఎం టిమోన్ బోరా తదితరులు హాజరయ్యారు. మహిళలు పని చేసే స్థలంలో లైంగిక వేధింపులకు గురైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చన్నారు. గృహా వేధింపులపై జిల్లా జడ్జి కోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ఉన్నంని సబ్ కలెక్టర్ అనుప్ పండా అన్నారు. లైంగిక వేధింపులపై పోష్ చట్టం 2013, బాలికలపై అత్యాచారానికి పాల్పడితే పోస్కో చట్టం, బాల్యవివాహాలపై చట్టాలున్నాయని, వీటిపై అవగాహన కలిగి ఉండాలని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మినాతీ పాడీ అన్నారు. ట్రాన్స్‌జెండర్స్ జాస్మిన్, మధుబోరాడో, ఐ.సి.డి.ఎస్ అధికారి కోమలాంగి, తదితరులకు మెమొంటోలతో జిల్లా మిషన్ శక్తి ఆధ్వర్యంలో అందజేశారు.


