జయపురం: స్థానిక జమాల్ వీధి(రామాలయం వీధి)లో వేంచేసి ఉన్న శ్రీరామమందిరంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామ నవరాత్రి కల్యాణ సామ్రాజ్య పట్టాభిషేకానికి గురువారం ఉగాది ముహూర్తపురాట ప్రతిష్టాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ పరిచాలన కమిటీ కార్యదర్శి సానా జగదీశ్వర రావు, జయపురం కళింగ వైశ్య కుల పెద్ద వారణాశి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని ఆలయ పురోహితులు గన్నవరపు కోటేశ్వర వర ప్రసాద్ శర్మ, ఎలిమిరి నాగేశ్వర రావు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
రాయగడ: స్థానిక బాలాజీ నగర్‌లో ఉన్న కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ఉగాదిని పురస్కరించుకుని గురువారం వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యులు, ప్రసన్నలతో పాటు ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు చంద్రమౌళి కుముంధాన్, శ్రీనివాస్ కుముంధాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
శైలపుత్రి రూపంలో మజ్జిగౌరి
రాయగడ: చైత్రమాసం నవరాత్రిలో భాగంగా మజ్జిగౌరి అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో
జయపురం: స్థానిక వల్లభ నారాయణ మందిరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రీయ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యాయవాది హరిష్ ముదులి పాల్గొన్నారు. వేడుకల్లో పట్టణ సంఘ చాలక్ ప్రేమానందనాయిక్, డాక్టర్ నిరంజన్ మిశ్ర, ముఖ్యవక్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ్ రాయగురు నూతన సంవత్సరంపై ప్రసంగించారు.


