సమష్టి పురోగతి సాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

సమష్టి పురోగతి సాగిద్దాం

Mar 20 2026 7:56 AM | Updated on Mar 20 2026 7:56 AM

భువనేశ్వర్‌: స్థానిక లోక్‌ భవన్‌లో గురువారం పరాభవ నామ ఉగాది, గుడి పడ్వా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు సంస్కృతి, ఆత్మీయత, నూతన ఆరంభాల ఉమ్మడి స్ఫూర్తితో నిండిన హృద్యమైన అనుభవం. తెలుగు, కన్నడ, మరాఠీ వర్గాల సభ్యులతో సంభాషించడం మన వైవిధ్యమే మన గొప్ప బలం అనే నమ్మకాన్ని మరింత బలపరిచిందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి తెలిపారు. నూతన సంవత్సరంలోకి అడుగిడిన ఈ శుభ తరుణంలో సామరస్యం, కృతజ్ఞత, సమష్టి పురోగతిని స్వీకరిద్దాం అని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ శాంతి, శ్రేయస్సు, సంతోషంతో వర్ధిల్లాలని గవర్నరు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement