న్యూస్‌రీల్
పురస్కారానికి సాహితీవేత్త చక్రపాణి ఎంపిక
జయపురం: దీర్ఘకాలంగా సాహిత్య రంగంలో ఒడియా సాహిత్యానికి సేవలు అందిస్తున్న ప్రముఖ సాహితీ వేత్త చక్రపాణి పరిచ ‘కవి బలరాం పూజారి స్మృతి’పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 21వ తేదీన జయపురంలో జరగనున్న కవి బలరాం పూజారి 52వ జయంతి సందర్భంగా చక్రవాణికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు నిర్వాహక కమిటీ బుధవారం ప్రకటించింది. పురస్కారం కింద ప్రశంసా పత్రం, మెమెంటో, నగదు బహుమతి అందజేసి సత్కరిస్తామని వెల్లడించారు. సాహిత్య ప్రపంచంలో కవిత్వ రచనలో తన ప్రత్యేక శైలీ, నైపుణ్యంతో సాహిత్య సృజన రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి చక్రపాణి పరిచ కవితా శైలి పాఠకుల మన్ననలలు పొందాయి. ఆయన గ్రంథాలు ఒడియా సాహిత్య ప్రపంచానికి అందించారని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక కవిత్వానికి ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చినకవిగా గుర్తింపు పొందారని వివరించారు.
వెయిట్‌లిఫ్టర్‌కు సీఎం సత్కారం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ పెక్కట గ్రామవాసి, క్రీడాకారిణి జ్యోత్స్న శోబోరో వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో విజయం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మఝి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ప్రభాతీ పరిడా సమక్షంలో పూరీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఘనంగా సత్కరించారు. జనవరిలోనూ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బాల పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. అరుదైన గౌరవం దక్కినందుకు జిలా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, క్రీడాశాఖ అధికారి త్రినాథ సాహు అభినందనలు తెలిపారు.
వంట గ్యాస్ సరఫరా చేస్తాం
భువనేశ్వర్: నిత్య అవసరాలకు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాలో ఎటువంటి కొరత లేదని, ఈ నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం భయపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ ప్రజలకు హామీ ఇచ్చారు. లోక్ సేవా భవన్‌లో రాష్ట్రంలో ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ లభ్యతకు సంబంధించిన పరిస్థితిని సమీక్షించిన తర్వాత అనూ గర్గ్ ఈ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ), ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల అధికారులు పాల్గొన్నారు. చమురు శుద్ధి కర్మాగారాలు, డిపోల నుం,ఇ పంపిణీదారులు, రిటైల్ అవుట్‌లెట్‌లకు ఎల్‌పీజీ పంపిణీ ప్రక్రియ, సరఫరా గొలుసు నిర్వహణపై ఈ సమావేశంలో వివరణాత్మకంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
జయపురం పట్టణంలో ప్రసిద్ధ డెప్పిగుడ అగ్నిగంగమ్మ ఘటజాతర బుధవారం అంగరంగ వైభవంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు ఘటాలతో తరలివచ్చారు. డెప్పిగుడలోని అగ్నిగంగమ్మ ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా మొదలై భాజా భజంత్రీలు, వివిధ వేషధారణల నడుమ 26వ జాతీయ రహదారి సమీపంలోని గంగమ్మ విడిది గుడికి చేరుకుంది. అక్కడ అమ్మవారి రాక కోసం నిరీక్షిస్తున్న వందలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అడుగడుగునా అమ్మవారి పూజారి కాళ్లను భక్తులు కడిగి పూజలు చేశారు. ఎండలు నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు చల్లటి మజ్జిగ సరఫరా చేశారు. భక్తులు కోళ్లు, గొర్రెలను గంగమ్మ తల్లికి మొక్కుగా చెల్లించారు. గంగమ్మ శోభాయాత్ర సందర్భంగా కాళీమాత, దుర్గమ్మ తదితర వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. జయపురం
భక్తులకు మజ్జిగ అందజేస్తున్న నిర్వాహకులు
గంగమ్మ తల్లి కోసం సారె తీసుకెళ్తున్న మహిళలు
అగ్ని గంగమ్మ గుడి వద్ద బారులు తీరిన భక్తులు
ఆకట్టుకున్న వేషధారణ
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం


