సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు | - | Sakshi
Sakshi News home page

సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

మందస : ‘మా భూములు మా హక్కు. అందులో సెంటు భూమి కూడా ఇవ్వడం జరగదు. ఎన్ని చెప్పినా మా భూములును వదులుకునేందుకు సిద్ధంగా లేం’ అని రాంపురం గ్రామస్తులు తేల్చి చెప్పారు. మందస మండలం రాంపురంలో మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో కార్గో ఎయిర్‌పోర్టుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్టుతో ఆర్థికంగా మేలు జరుగుతుందని, ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పగా.. గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భూములు ఇవ్వబోమంటూ ఏడాదికి పైగా పోరాటం చేస్తున్నా గోడు వినపించడం లేదా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement