మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

పర్లాకిమిడి: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి నారీ శక్తిని చాటిచెప్పాలని జిల్లా జడ్జి, న్యాయ సేవా ప్రాదకరణ అధ్యక్షుడు జగదీష్‌ ప్రసాద్‌ మహంతి అన్నారు. జిల్లా ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రంలో (డైట్‌) ప్రగతి మహిళా సంఘటన్‌, డి.ఎల్‌.ఎస్‌.ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సివిల్‌ కోర్టు రిజిస్ట్రార్‌ ప్రసన్న కుమార్‌ బెహరా, ప్రగతి మహిళా సంఘటన్‌ అధ్యక్షుడు లోకనాథ మిశ్రా, కార్యదర్శి తనూజా శతపథి, మహిళా కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్‌ భారతీ పాణిగ్రాహి, ఇంజినీర్‌ మధుస్మితా దాస్‌, బిచిత్రానంద బెబర్తా తదితరులు హాజరయ్యారు. సీనియర్‌ మహిళా న్యాయవాది (ఆర్‌.ఉదయగిరి) కమలినీ పట్నాయక్‌ను జిల్లా జడ్జి సత్కరించారు. ప్రగతి మహిళా సంఘటన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను జిల్లా జడ్జి అందజేశారు. కుమారి పాయల్‌ పాత్రో అతిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement