యూపీఎస్సీ విజేతకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ విజేతకు సన్మానం

Mar 8 2026 7:24 AM | Updated on Mar 8 2026 7:24 AM

భువనేశ్వర్‌: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2026లో జాతీయ స్థాయిలో 100వ ర్యాంక్‌ సాధించిన సాత్విక్‌ సత్యకాం దేవతను ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ శనివారం లోక్‌సేవా భవన్‌లో సత్కరించారు. కెంజొహర్‌ జిల్లా హతొ డిహి మండలానికి చెందిన సాత్విక్‌ తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా అభినందించారు. సాత్విక్‌ సాధించిన విజయం రాష్ట్ర యువతకు, ముఖ్యంగా కెంజొహర్‌ జిల్లాకు ప్రేరణగా నిలుస్తుందని సీఎం అభివర్ణించారు. పాలన అధికారిగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. సాత్విక్‌ బలమైన పాలన అధికారుల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు కావడం విశేషం. అతని తండ్రి గోస్వామి దేవతా విరామ సివిల్‌ సర్వీసు ఉద్యోగి. సాత్విక్‌ సత్యకాం దేవత 2018లో భువనేశ్వర్‌ ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ (ఓయూటీఆర్‌) నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించడానికి ముందు 2023 నుంచి నాబార్డ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement