పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. మహిళా సాధికారత, సమానత్వం, అవకాశాలను అందిపుచ్చుకోవడం, ఆరోగ్యంపై ప్రముఖులు ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ సుకన్య సనపాల మాట్లాడుతూ.. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వాస్ స్వచ్ఛంద సంస్థ (ఏసాక్స్) టి.ఐ.ప్రాజెక్టు మేనేజర్ పి.సునీత మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. అనంతరం మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితాపాత్రో, డైరక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాడి, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎన్.సంధ్య, అసోసియేట్ డీన్ ప్రజ్ఞా పాణి తదితరులు పాల్గొన్నారు.


